Header Banner

అనంతపురం పర్యటనలో సీఎం చంద్రబాబు! హంద్రీనీవా కాలువ వద్ద అధికారులతో సమీక్ష!

  Fri May 09, 2025 09:19        Politics

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) శుక్రవారం అనంతపురం జిల్లా (Anantapur District)లో పర్యటించనున్నారు (Visit). ఉరవకొండ నియోజకవర్గం (Uravakonda Constituency)లో హంద్రీనీవా (Handri-Neeva) కాలువ విస్తరణ, లైనింగ్‌ పనులను ఆయన పరిశీలిస్తారు. శుక్రవారం ఉదయం విజయవాడ విమానాశ్రయం నుంచి బయల్దేరి శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో ఉరవకొండ నియోజకవర్గంలోని వజ్రకరూరు మండలం ఛాయాపురానికి చేరుకుని ఆ తర్వాత రోడ్డు మార్గాన ఆ గ్రామ సమీపంలోని హంద్రీనీవా కాలువ వద్దకు చేరుకుంటారు. అనంతరం జలవనరుల శాఖ అధికారులతో సమావేశమవుతారు. ఛాయాపురం ప్రజలతో ముఖాముఖి మాట్లాడతారు.

సీఎం చంద్రబాబు టూర్ షెడ్యూల్ ఇదే..
సీఎం చంద్రబాబు శుక్రవారం ఉదయం 10 గంటలకు ఉండవల్లి నుంచి బయలుదేరి 10:35 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు.. 10:40 గంటలకు విజయవాడ ఎయిర్ పోర్ట్ నుంచి విమానంలో బయలుదేరి 11:20 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎయిర్ పోర్ట్‌కు చేరుకోనున్నారు. అక్కడి నుంచి 11:30 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 12:00 గంటలకు ఉరవకొండ నియోజకవర్గం ఛాయాపురం చేరుకుంటారు. 12:10 గంటలకు హెలిప్యాడ్ నుంచి బయలుదేరి ఛాయాపురం సమీపంలో ఉన్న హంద్రీనీవా కాలువ వెడల్పు పనులను పరిశీలిస్తారు.

అనంతరం నీటిపారుదల శాఖ అధికారులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12:45 గంటలకు సీఎం చంద్రబాబు హెచ్ఎన్ఎస్ఎస్ కెనాల్ నుంచి బయలుదేరి 12:50 గంటలకు ప్రజావేదిక వద్దకు చేరుకుంటారు. 12:50 గంటల నుంచి 01:30 గంటల వరకు రిజర్వ్ టైమ్.. తర్వాత 2 గంటల నుంచి 3:30 గంటల వరకు ఛాయాపురం గ్రామపంచాయతీ ప్రజలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. అక్కడి నుంచి 3:35 గంటలకు బయలుదేరి 3:40 గంటలకు హెలిప్యాడ్‌కు వెళతారు. 3:45 గంటలకు ఛాయాపురం హెలిప్యాడ్ నుంచి హెలిక్యాప్టర్‌లో బయలుదేరి 4:15 గంటలకు శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలోని ఎయిర్ పోర్ట్‌కు చేరుకుంటారు. అనంతరం 4:25 గంటలకు పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ నుంచి హైదరాబాద్ బయలుదేరి రానున్నారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో పోలీస్ అధికారులు పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి: ఏపీ హైకోర్టులో భారీ ఉద్యోగాలు! మెట్రిక్ నుంచి డిగ్రీ అర్హతతో.. ఇక ఆలస్యం చేయొద్దు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్! ఆ శాఖలో ఉద్యోగాల భర్తీకి సీఎం గ్రీన్ సిగ్నల్!

 

గాలికి ఏడేళ్లు జైలు, మాజీ మంత్రికి క్లీన్ చిట్! ఓఎంసీ కేసులో కోర్టు సంచలన తీర్పు..!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఏపీ యువతకు గుడ్ న్యూస్.. యునిసెఫ్‌తో ప్రభుత్వం ఒప్పందం.. 2 లక్షల మందికి లబ్ధి!

 

ఏపీ లిక్కర్ స్కాంలో దూకుడు పెంచిన ఎస్‌ఐటీ! మరో ముగ్గురు కీలక నేతలపై కేసు నమోదు!

 

ఒక్కసారిగా ఆ ప్రాంతంలో తీవ్ర గందరగోళం.. టీడీపీ నేతలకు తప్పిన ప్రమాదం.!

 

అంగన్‌వాడీ టీచర్లకు శుభవార్త.. ఈ నెల(మే) నుంచి అమల్లోకి ఉత్తర్వులు!

 

 

వైసీపీకి దిమ్మతిరిగే షాక్.. వంశీ తో పాటు వారికి కొడా రిమాండ్ పొడిగింపు! 

 

ఏపీలో వారందరికీ శుభవార్త! తెల్లరేషన్ కార్డు ఉంటే చాలు, 50 శాతం రాయితీ!

 

'తల్లికి వందనం' పై తాజా నిర్ణయం! అర్హులు వీరే, నిబంధనలు..!

 

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #ChandrababuNaidu #AnantapurVisit #HandriNeeva #APCM #IrrigationProjects #AndhraPradesh #DevelopmentTour